శ్రీ మహావిష్ణువు కూర్మావతారం మనిషికి మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది.

6 months ago
10

శ్రీ మహావిష్ణువు కూర్మావతారం మనిషికి మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది. Lord Shri Mahavishnu Kurmavataram Gives A Great Message To Humanity.

శ్రీ మహావిష్ణువు కూర్మావతారం, మనిషికి మరో మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది. పట్టుదల, ఓర్పు, సహనం మనిషికి తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే అతడి లక్ష్యం నెరవేరుతుందని ఈ అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు ఆచరణాత్మక సందేశం ఇచ్చాడు. మనం ఏమైనా గొప్ప కార్యాలు తలపెట్టినప్పుడు ఆ పని భారం మందర పర్వతం తీరులో, కార్యసాధనలో మనకు కలిగే అవాంతరాలు మందర పర్వతానికి కట్టిన వాసుకి సర్పం విడిచే విషజ్వాలల్లాంటివి. అవి మన పరిస్థితుల్ని మరింతగా వేడెక్కిస్తాయి. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా పట్టువదలకుండా స్థిరంగా ఉంటేనే అమృతం పుట్టినట్లు, మన కార్యం విజయవంతమై ఆశించిన లక్ష్యసాధన అనే అమృతం పుడుతుందని కూర్మం సందేశాన్నిస్తుంది. ఈ సందేశాన్ని అందిపుచ్చుకుంటే మానవ జీవితం అమృతమయం అవుతుందనటంలో సందేహం లేదు.

Loading comments...