Sugarcane Juice - Benefits | చెరకు రసం యొక్క అద్భుతమైన ప్రయోజనాలు

5 months ago
14

మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే హాయిగా అనిపిస్తుంది. చెరకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు..

చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఖనిజాలుంటాయి. విటమిన్‌-ఎ, బి, సి కూడా ఎక్కువే.

ఇది అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్‌ చేస్తుంది.

దీనిలోని ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి.
మలబద్ధకాన్ని పారదోలుతుంది.
క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధకత పెరుగుతుంది.
దీంట్లోని ఫ్లేవనాయిడ్స్‌, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్‌ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.
పీచు సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తాగిన వెంటనే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఎంపిక. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నోటి దుర్వాసనను తగ్గించి దంతసమస్యలను నిర్మూలిస్తుంది.
శరీరంలో ప్రొటీన్‌ స్థాయులను పెంచుతుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కామెర్లు వచ్చినవారికి ఈ రసం మేలు చేస్తుందంటారు. కాలేయం పనితీరును మెరుగుపరిచి అనారోగ్యానికి కారణమైన పదార్థాలను బయటకు పంపుతుంది.

#halfacrecultivation

Loading comments...