అందం మరియు ఆరోగ్యం ఇచ్చే మంచి ఆహారం 🌿 🐟✨ 🌟🥑🍓🐟🌿 | Good food that gives Beauty and Health 🌿 🐟✨ 🌟🥑🍓🐟🌿

7 months ago
19

అందం మరియు ఆరోగ్యం ఇచ్చే మంచి ఆహారం.. 🌿 🐟✨ 🌟🥑🍓🐟🌿
పాలకూర..
దీంట్లో శరీరానికి కావాల్సిన ఆవశ్యక విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉన్నాయి. ఇందులోని పోషకాలు మేనును మెరిపిస్తాయి.
చేపలు..
దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.
నట్స్..
వీటిలో యాంటీ-ఏజింగ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉండి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అంతేకాదు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, పీచు అధిక మొత్తంలో ఉంటాయి.
గ్రీన్ టీ..
దీన్లోని శక్తిమంతమైన ఫ్లేవనాయిడ్స్ వివిధ రకాల జబ్బుల నుంచి శరీరాన్ని కాపాడతాయి. ఇవి ముడతలు, చర్మం సాగుదలను తగ్గిస్తాయి.
దానిమ్మ..
దీన్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ పోరాడి చర్మం త్వరగా వృద్ధాప్య ఛాయలను సంతరించుకోకుండా చూస్తాయి.
పెరుగు..
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అందమైన చర్మాన్ని ఇస్తుంది. దీన్ని పూతలా వేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి.

గుర్తుంచుకోండి మితంగా తింటేనే ఆరోగ్యం.

Loading comments...