కాలీ పసుపు - ఈ పసుపు కొమ్ములు నీలం రంగులో ఉంటాయి |Kali Turmeric These yellow horns are blue in color

7 months ago
29

కాలీ పసుపు - ఈ పసుపు కొమ్ములు నీలం రంగులో ఉంటాయి.

మనకు తెలిసిన పసుపు కొమ్ముల కంటే భిన్నమైనది ఈ నీలకంఠ పసుపు. ఇది నీలం రంగులో ఉంటుంది. దీనిని మాత్రం నల్ల పసుపు లేదా కాలీ పసుపు, నీలకంఠ, నరకచూర, కృష్ణకేదార, కాలీ హరిద్ర వంటి పేర్లతో పిలుస్తారు. నీలం రంగులో పండే ఆ పసుపుని నలుపు రంగుతో ఎందుకు పిలుస్తారు అంటే, పలు రాష్ట్రాల్లో సాగయ్యే కాలీ పసుపు మొక్క నుంచి వచ్చే పువ్వూ, పొడీ కాళీ మాతకు ఎంతో ప్రీతిపాత్రం. అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించడంతో అది కాలీ పసుపు లేదా నల్ల పసుపుగా ప్రాచుర్యమైంది. శాస్త్రీయ నామం కర్కుమా సీసియా ( Curcuma caesia ).
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె సమస్యల్ని దూరం చేస్తుంది. పచ్చి కొమ్మును నీళ్లలో వేసి తాగితే జీర్ణక్రియలు మెరుగుపడతాయి. దీనికి ఫార్మా రంగంలో డిమాండ్ ఎక్కువ. మనదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లోనూ, మధ్యప్రదేశ్లోనూ పండిస్తారు. రుచి విషయానికొస్తే కాస్త చేదుగానూ ఘాటుగానూ, వాసన మాత్రం కర్పూరాన్ని పోలి ఉంటుంది. అందుకే సౌందర్యోత్పత్తుల తయారీలోనూ వాడతారు. రోగనిరోధకశక్తిని తట్టుకోగలిగిన ఈ పసుపు సాగుకు రసాయనాలు అక్కర్లేదు.

Kali Turmeric These yellow horns are blue in color

This Neelkantha Turmeric is different from the Turmeric Horns that we know. It is blue in color. It is known as black turmeric or Kali turmeric, Nilakantha, Narakachura, Krishnakedara, Kali Haridra. The reason why the blue colored turmeric is called black is because the flower and powder of Kali Turmeric, which grows in many states, is very dear to Mother Kali. It is popularized as Kali Turmeric or Black Turmeric as it is specially offered to Goddess. The scientific name is Curcuma caesia.
Increases immunity. Removes heart problems. Drinking green horn in water improves digestion. It has high demand in pharma sector. In our country, it is grown in North Eastern states and Madhya Pradesh. The taste is slightly bitter and pungent and the smell is similar to camphor. That is why it is also used in the preparation of beauty products. This immune tolerant turmeric cultivar does not require chemicals.

Loading comments...