సోంపు ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు | Sompu Uses in Telugu | Natural Mouth Freshener|Fennel Seeds

5 months ago
42

ఎందుకు మంచిది..

నోటి దుర్వాసనని దూరం చేయడంతోబాటు, ఏ కాస్త అజీర్తిగా అనిపించినా కాసిని సోంపు గింజల్ని నమిలితే అది మాయమవుతుందంటారు సంప్రదాయ వైద్యులు. ఈ గింజల్ని మరిగించి తీసిన డికాక్షనన్ను పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పడతాయట. పసిపిల్లలకు ఈ గింజల్ని మరిగించిన నీటిని ఇస్తే పొట్టలో నొప్పి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ గింజలనుంచి తీసిన నూనె దగ్గు, బ్రాంకైటిస్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ నూనెతో మర్దనచేస్తే కీళ్లనొప్పులూ తగ్గుతాయి, నరాలకూ స్వాంతన కలుగుతుంది అంటారు సంప్రదాయ వైద్యులు. పూర్వం గ్లకోమావ్యాది నివారణకి వీటి రసాన్ని ఇచ్చేవారట. వేసవిలో సోంపుతో చేసిన పానీయాన్ని తాగితే వేడి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఇది మంచి ఔషధమే కాదు, అద్భుత పోషకాలూ ఉన్నాయంటారు. ఖనిజాలూ, విటమిన్లకూ సోంపుగింజలు మంచి నిల్వలు.

Loading comments...