జొన్నపేలాల తయారీ ఆరోగ్యప్రయోజనాలు | Health benefits of Sorghum #halfacrecultivation

7 months ago
54

జొన్నపేలాల తయారీ ఆరోగ్యప్రయోజనాలు

జొన్నలు తృణధాన్యాల కోవకి చెందుతాయి. వీటితో అటుకులు, రవ్వ, నూకలు, పాస్తా, పేలాలు ముఖ్యమైనవి. మిగిలిన అన్ని జొన్న పదార్థాల కంటే పేలాలు సులభంగా జీర్ణమవుతాయి. పేలాల్లో ఫైటిక్ ఆసిడ్ తక్కు వుండటం వల్ల ఇవి ఆరోగ్యాన్ని దృఢపరుస్తాయి. జొన్న పేలాలు వినియోగించడం వల్ల గ్లైసిమిక్ నిష్పత్తి పెరుగుతుంది. అందుచేత ఇవి అన్ని వయస్సులు వాళ్లకి ఎంతో అనుకూలమైనవి.

అన్ని రకాల జొన్నలతో పేలాలు తయారు చేయలేం. జొన్న పరిశోధన సంచాలనాలయం, హైదరాబాదు వారు పేర్కొన్న సి43, పాప్ 53, ఎమ్ 35-1, ఫూలె పంచమి మంచి పేలాల రకాలు. రోజువారి వాడకానికి పైన చెప్పిన రకాలతో పేలాలు తయారుచేసుకోవచ్చు. నూనె వేయక పోవటంవల్ల ఇవి శరీర బరువు నియంత్రణకి ఉపయోగపడతాయి.

జొన్నలతో వివిధ రకాల పదార్ధాలు : ఈ మధ్య కాలంలో జొన్నలతో వివిధ వంటకాలు తినుబండారాలను జొన్న పరిశోధన సంచాలనాలయం, హైదరాబాదు వారు అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారు. జొన్నలతో కేకులు, అటు కులు, పేలాలు, సేమియా, రవ్వ, పాస్తా మొదలగునవి తయారుచేస్తున్నారు.

జొన్న పేలాల తయారీ:
ఒక గుప్పెడు (65-70 గ్రా.) జొన్నలను తీసుకోవాలి.
కిచెన్ పాప్ మిషన్లో వేసి రెండు నిముషాలపాటు పాప్ చేయాలి. గింజలు మిషన్లో వేసిన రెండు నిముషాల్లో టపటపలాడుతూ జొన్న పేలాలు బయటకు పడుతూ వస్తాయి. వీటిని ఒక పళ్ళెంలో పట్టు కోవచ్చు.
లేదా బాణలిని బాగా వేడి చేసి జొన్న గింజలు వేయాలి. త్వరగా అట్లకాడతో తిప్పాలి. తర్వాత బాణలిని మూస్తే పేలాలు
పడిపోకుండా ఉంటాయి. పాలల్లో వేసుకుని తినవచ్చు లేదా ఉప్పు, కారం వేసుకొని తినవచ్చు. ఇవి కరకకరలాడుతూ చాలా రుచికరంగా ఉంటాయి.

ఈ పాప్ మిషన్లో ఒడియాలు, అప్పడాలు కూడా నూనె లేకుండా వేయించుకోవచ్చు. వీటిని జొన్న పేలాలకేగాక
ఇతర ఒడియాలు, మొక్కజొన్న పేలాలు, అప్పడాలు నూనె లెకుండా వేయించడానికి ఉపయోగించవచ్చు. ఇలా తయారుచేసిన పాలల్లో వేసుకుని తినవచ్చు లేదా ఉప్పు, కారం వేసుకొని తినవచ్చు. ఇవి కరకకరలాడుతూ చాలా రుచికరంగా ఉంటాయి.

Health benefits of sorghum. sorghum pop-corn.

Loading 1 comment...