మేలుజాతి పెరటికోళ్ళు పెంపకం | Country Hens | #halfacrecultivation

7 months ago
43

మేలుజాతి పెరటికోళ్ళు పెంపకం.

భారతదేశంలో కోళ్ళ పరిశ్రమ శక్తివంతమైన పరిశ్రమగా వృద్ధి చెందింది. మనగ్రామాల్లోని దేశీయ కోళ్ళు ఒకటిన్నర కిలోల కంటే ఎక్కువ పెరగవు. ఇది జన్యుసంబంధ అవరోధం. కోడిపెట్టలు 7 - 8 నెలల తర్వాత గుడ్లు పెడతాయి. గుడ్లు చిన్నవి. తక్కువ మాంసం, తక్కువ గుడ్లు లభించడం వల్ల వాటి పెంపకం అంతలాభసాటిగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ గుడ్లు పెట్టగల, తక్కువ వయస్సులో ఎక్కువ మాంసాన్నిచ్చే మేలుజాతి పెరటి కోళ్ళను మనదేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈకోళ్ళు కూడా మన దేశీకోళ్ళలాగే రంగులోగాని, రోగనిరోధక శక్తిలోగాని, శత్రుజంతువుల నుంచి తప్పించుకోవడంలోగానీ ఏమాత్రం తీసిపోవు. అవసరం, అనుకూలతను బట్టి ఒక్కో ఇంటివద్ద గుడ్లకోసం గాని, మాంసంకోసం గాని 10 నుంచి 20 పెరటి కోళ్ళను పెంచుకోవచ్చు.

ఈ కోళ్ళు పెరట్లో దొరికే క్రిమికీటకాలు, రాలిపోయిన ధాన్యపు గింజలు, వంటగది వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకుంటాయి. మేలుజాతి పెరటికోళ్ళు పెంపకంతో మన అవసరాలను తీర్చుకోవడంతో పాటు అదనంగా ఆదాయం పొందవచ్చు.

మేలుజాతి పెరటి కోళ్ళ
కృషి బ్రో (మాంసం)
గ్రామప్రియ (గుడ్లు)
వనరాజా (గుడ్లు, మాంసం)
శ్రీనిధి (గుడ్లు, మాంసం)
ప్రాజెక్ట్ డైరక్టరేట్ ఆన్ పౌల్ట్రీ, రాజేంద్రనగర్, హైదరాబాద్.

రాజశ్రీ,(గుడ్లు, మాంసం)
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, AICRP, రాజేంద్రనగర్, హైదరాబాద్.

Loading comments...