ఈ పార్క్‌లో కాకులు 🐦 కూడా ఉద్యోగులు | Crows 🐦are also employees of this park |

6 months ago
36

కాకులు కూడా ఉద్యోగులే..
కాకి చాలా తెలివైనది. కాకికి పనిచేయడం, ప్రతిగా వాటికి మంచి ఆహారం ఇస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనని అందిపుచ్చుకుంది ఫ్రాన్స్ లోని ఓ థీమ్ పార్కు. చెత్తని శుభ్రంచేయడం లాంటి పనులకి కాకుల్ని పెట్టుకోవాలనుకుంది. చెత్తను తెచ్చి బుట్టలో పడేసేలా కాకులకు శిక్షణ ఇచ్చారు. ఒకసారి డబ్బాలో చెత్తను పడేస్తే, కాకికి నచ్చే ఆహారం వస్తుంది. అది తిని మళ్లీ చెత్త వెతకడానికి వెళ్లేవి. ఆశించినట్లుగానే అవి చక్కగా పనిచేస్తున్నాయి. పార్కులో అన్ని పక్కలా కలియతిరుగుతూ, ఎక్కడ ఏ చిన్న చెత్త కన్పించినా తెచ్చి డబ్బాలో వేస్తున్నాయి. అదొక పనిలాగా కాక సరదాగా చేస్తుండడంతో, అలాగే కొనసాగిస్తున్నారు. నిజానికి పక్షులతో పనిచేయించుకోవడం తమ ఉద్దేశం కాదనీ, పక్షుల్ని చూసి అయినా మనుషులు మారి, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా ఉంటారని తమ ఆశ అనీ పార్కు యాజమాన్యం చెబుతోంది.

Loading comments...