Crow is an intelligent bird | తెలివైన పక్షిజాతి కాకి, రుణం ఉంచుకోవు. |

7 months ago
26

తెలివైన పక్షి కాకమ్మ

కోర్విడై కుటుంబంలోని మిగిలిన పక్షులకన్నా కాకి బలమైనదీ తెలివైనదీగా ఎదిగింది.

ఎప్పుడైనా ఒకసారి నాలుగు గింజలు వేశారంటే, మిమ్మల్ని మీ కారునీ కూడా గుర్తుపెట్టుకుంటాయి. దానివల్ల ఏమిటీ లాభం అనుకోకండి, అవి మీ రుణం ఉంచుకోవు. కృతజ్ఞతగా బహుమతులు తెచ్చివ్వడం వాటికి చాలా ఇష్టం. తమ కళ్లకు అందంగా ఆకర్షణీయంగా కన్పించిన వాటిని తెచ్చి మీ ముందు పడేస్తాయి. పూసలూ గవ్వలూ రాళ్లూ రంగు రంగుల ఈకలూ లాంటివెన్నో సేకరించి తెచ్చిస్తాయి.

మనం వాటిని అంతగా పట్టించుకోం కానీ అవి మాత్రం మనల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉంటాయట. ఆ పరిశీలన నుంచే అవి పాఠాలూ నేర్చుకుంటున్నాయి, మనుషుల్లాగే తెలివైన ప్రాణులు అనిపించుకుంటున్నాయి.
Crows social behavior.
Crow does not keep debt.
Corw intelligence.
Birds with high IQ.

Loading comments...