Goti Talambralu

6 months ago
4

గోటితలంబ్రాలు.. అంటే ఏమిటో తెలుసుకుందాం

శ్రీరామనవమి నాడు భద్రాచలంలో స్వామి వారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ధాన్యపు వడ్లను రోలులో దంచో లేక మిల్లులో మరపెట్టినవి కావు. ఆడవారు తమ చేతిగోళ్ళతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలచిన బియ్యం. కనుక వీటిని "గోటి తలంబ్రాలు" అంటారు. అంతే కాదు తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం అనే గ్రామంలో ఈ తలంబ్రాలు కొరకు మరియు విత్తనాల వడ్లు కొరకు ప్రత్యేకంగా వరి సాగు చేస్తారు. శ్రీరామ కళ్యాణం జరుగుతున్నప్పుడు తలంబ్రాలతో పాటు వ్యవసాయానికి కావలసిన వడ్లను కూడా స్వామి వారి పాదాలు చెంత పెడతారు. ఆ వడ్లనే తిరిగి యధావిధిగా వరి సాగుకు వాడతారు. వరి పైరు పెరిగాక వరి కోతలు కోసేవారు విలక్షణంగా శ్రీరామ, లక్ష్మణ, హనుమంత, సుగ్రీవ మొదలగు వేషధారణలో వచ్చి కోతలు సాగిస్తారు. వరి కోతతో పాటు శ్రీరామ నామం జపిస్తూ సంబరాలు జరుపుతారు.

Loading comments...