కుజ గ్రహ దోషం వల్ల కలిగే వ్యాధులు

8 months ago
21

కుజ గ్రహ దోషం వల్ల కలిగే వ్యాధులు

1. కుజుడు స్త్రీల విషయంలో ఆలస్య వివాహాలు, వివాహనంతరం అత్తమామలు, బావమరుదులు, ఆడపడుచులతో పోరు ఎక్కువ చేస్తాడు.

2 . మోసకారులు, దొంగస్వభావం కలవారితో ఆపదలు కలిగిస్తాడు.

3 . భార్యతో మనస్పర్ధలను కలిగించి, వైవాహిక జీవితంలో కలతలు రేపుతాడు.

4 .యంత్ర సంబంధ వ్యాపారాలు, వృత్తుల్లో కష్ట నష్టాలు కల్పిస్తాడు.

5 .అనవసర కేసుల్లో ఇరికించి కోర్టుకేసులు, నీలాపనిండలు కలిగిస్తాడు.

6 .అన్నదమ్ముల్లో సఖ్యతను తగ్గించి, ఆస్థి తగాదాలు సృష్టిస్తాడు.

7 . స్త్రీలను అన్నిరకాల కుటుంబ, సాంసారిక బాధలకు లోను చేస్తాడు.

8 .మెట్ట వ్యవసాయంలో నష్టాలు కలిగిస్తాడు.

9 .గుహ్యాంగ సంబంధ రోగాలు కలిగిస్తాడు.

కుజగ్రహ దోషం వల్ల కలిగే వ్యాధులు

కుజుడు శరీర అంగాల్లో శిరస్సు, గుహ్యాంగాలను ప్రభావితం చేస్తాడు కనుక, మెదడు, జననేంద్రియ రోగాలపై ప్రభావం చూపెడతాడు. సర్వజీవరాశుల్లో ప్రవహించే స్వభావం కల పదార్థాలకు కారకుడవటం వల్ల, మానవ శరీరంలోని రక్తానికి సంబంధించిన రక్తక్యాన్సరు, రక్తపోటు, రక్తంలో గడ్డలు పేరుకుపోవుట, రక్తప్రవాహానికి అవరోధమేర్పడటానికి కుజుడే కారకుడు. స్త్రీ రోగాలైన ఎర్రబట్ట, గర్భాశయంలో కురుపులు, బుతుధర్మ లోపాలు, రక్తక్యాన్సరు వంటి వ్యాధులకు కారణం కుజుడే . ఎముకల్లో వుందే మజ్జకు కూడా ప్రధాన కారకుడవటంవల్ల శనితో కలిస్తే పోలియోవ్యాధి కల్గిస్తాడు. కిడ్నీలో జరిగే క్షాళన విధానానికి, మూత్రాశయ వ్యాధులకు, ప్రో ష్టేటు (గ్రంధి వ్యాధులకు కుజుడు కారకుడవుతాడు. రాహువుతో కలిస్తే తీవ్ర అనర్దాలు కలిగిస్తాడు లేదా (ప్రమాదాల వల్ల దెబ్బలు, అంగవైకల్యాలు కల్గించే అవకాశముంది. శారీరకంగా మనిషిని కష్టపెట్టే ఉగ్రతత్వం కలిగినవాడు కుజుడు.

సర్వేజనః సుఖినోభవంతు
లోకాస్సమస్తా సుఖినోభవంతు

Loading comments...