హానికరమైన మానసికస్థితులను జయించడం

11 months ago
15

హానికరమైన మానసికస్థితులను జయించడం....

విపరీతమైన మానసికస్థితులను ఉదాహరణ.... కోపం, ద్వేషం, అసూయ వంటి తీవ్రమైన ప్రతికూలభావాలవల్ల మనస్సు పొందే స్థితి...
సులువుగా నిర్వచించలేము..
కాని అవి ఏమిటి అనేది మీకు తెలుసు. మీరొక విపరీత మనఃస్థితిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన సహజంగా ఉండదు, మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధమైన మనిషిలా ఉండరు. చివరి ఫలితం ఏమిటంటే మీరు అమితమైన దుఃఖాన్ని అనుభవిస్తారు.

ఇకముందు మీరు విచారగ్రస్తులయి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు విశ్లేషణ చేసుకోగూడదు? తెలిసితెలిసి, మొండితనంతో ఎలా మీకు మీరే దైన్యాన్ని కోరుతున్నారో మీరు చూస్తారు. మీరలా ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆహ్లాదకరంగాలేని మీ మనఃస్థితిని అనుభూతి పొందుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ గురించి మీరేమీ చెప్పకనే చెబుతారు, ఎందుకంటే మీ మొత్తం విచారకరమయిన మనఃస్థితి తన స్పందనలను మీ కళ్ళలో నింపుతుంది.

మిమ్మల్ని చూసినవాళ్ళు ఎవరయినా అక్కడ కనబడుతున్న ప్రతికూలతను ఎరుగుతారు. మీ కళ్ళలో ప్రతిఫలించిన ఆ చెడుభావనలను చూసి, ఇతరులు తొలగిపోతారు. అసౌకర్యం కలిగించే ఆ స్పందనలనుంచి దూరంగా వెళ్ళాలని కోరతారు,
మీ కళ్ళలో కనబడే ఆ ప్రతిఫలాన్ని తొలగించే ముందుగా, మీరు మీ మనస్సనే అద్దంనుండి ఆ మానసికస్థితులను తొలగించాలి.

Loading comments...