బొప్పాయి పండు | Papaya fruit #juice #Papaya #fruit #benfits #remidies #yogi #healthtips #lakshman

1 year ago
8

బొప్పాయి పండు | Papaya fruit #juice #Papaya #fruit #benfits #remidies #yogi #healthtips #lakshman

బొప్పాయి పండు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి.

రోజూ బొప్పాయి జ్యూస్ తాగితే ఈ లాభాలన్నీ పొందడం పక్కా..
పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే పండ్లలో బొప్పాయి పండు ఒకటి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ బొప్పాయి రసాన్ని 30మిల్లీ లీటర్ల నుండి 50మిల్లీ లీటర్ల వరకూ రోజూ తీసుకుంటే కొన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

హెల్త్ బెనిఫిట్స్..
బొప్పాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది.
దీంతో బరువు తగ్గుతుంది. దీంతో పాటు జీవక్రియని మెరుగ్గా చేస్తుంది.
ఇది ముఖ్యంగా పిల్లల్లో కడుపులోని పురుగులని చంపుతుంది. దీంతో పాటు చాలా లాభాలు ఉన్నాయి.

పీరియడ్ పెయిన్స్..
బొప్పాయిలో గర్భాశయంలోని వ్యర్థాలు, ట్యాక్సిన్స్‌ని బయటకు పంపే శక్తి ఉంది.
ఇది రుతుస్రావం సమయంలో వ్యర్థాలను బయటకు పంపుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

గర్భం దాల్చాలనుకునే మహిళలు దీనికి దూరంగా ఉంటే చాలా మంచిది.
దీనిని రోజుకి 30 మిల్లీగ్రాముల వరకూ తీసుకోవచ్చు. ఇందులో హార్మోన్ల అసమతుల్యతని కూడా హెల్ప్ చేస్తుంది.

క్యాన్సర్ కణాలు..
బొప్పాయిలో విటమిన్ ఎ. తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.
ఇవి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.
ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

శరీర బరువు తగ్గడం..
శరీర బరువు తగ్గించేందుకు బొప్పాయి పండు హెల్ప్ చేస్తుంది. ఇందులోని ఫైబర్ ఎక్కువగా ఉండడం
చాలా మంచిది. దీని వల్ల జీర్ణ సమస్యలు,

మలబద్ధకం దూరమవుతుంది. ఇందులో విటమిన్ ఎ సహా పోషకాలు ఉంటాయి.
దీంతో జీర్ణక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ కొవ్వుని తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే బొప్పాయి తీసుకుంటే బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

చర్మ కాంతి
చర్మాన్ని అందంగా మార్చడంలోనూ ఈ పండ్లు చాలా కీ రోల్ పోషిస్తాయి.
ఇందులో విటమిన్ ఎ, పొటాషియలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యల్ని దూరం చేసి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.
ఇది చర్మంలో మృతకణాలను దూరం చేసి ముఖానికి రక్త ప్రసరణ పెంచి డార్క్ కాంప్లెక్షన్‌ని తగ్గించి మంచి రంగు వస్తుంది.

ఇమ్యూనిటీ..
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. దీంతో చాలా వరకూ సీజనల్ సమస్యలు, జ్వరం, జలుబు వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.

​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Loading comments...