5 నిమిషాల్లో ఉప్మా ఎలా తయారు చేయాలి How to make Upma in 5min #how to #make #Upma in #5minute #ఉప్మా

11 months ago
10

5 నిమిషాల్లో ఉప్మా ఎలా తయారు చేయాలి How to make Upma in 5min #how to #make #Upma in #5minute #ఉప్మా
అందరికీ నమస్కారం,
ఇప్పుడు మనము ఉప్మా, ఏ విధంగా తయారు చేయాలో అన్న విషయాన్ని తెలుసుకుందాం
ముందుగా ఉప్మా కి కావాల్సిన పదార్థాలు రవ్వ, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పుదీనా, వీటిని చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి . మినపప్పు, పల్లీలు, శనగపప్పు, వీటిని నానబెట్టుకోవాలి
ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రవ్వ తీసుకొని రవ్వను బాగా వేయించాలి
కడాయిలోని రవ్వ వేగిన తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి చక్కగా వేయించాలి. కడాయిలోని రవ్వ గోధుమ రంగు వచ్చేంత వరకు చక్కగా వేయించాలి
ఇప్పుడు ఒక కడాయిని, తీసుకొని కడాయిలో నీరు, అంత ఆవిరి, అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి, అందులో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, వేసుకొని వీటిలో ఉన్న నీరు, అంతా ఆవిరి అయ్యేంతవరకు వేయించాలి
కడాయిలో ఉన్న మినపప్పు పల్లీలు శనగపప్పు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కడాయిలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి
కడాయిలో ఉన్న మినపప్పు పల్లీలు శనగపప్పు మంచిగా వేగిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చు
నూనెలో మిశ్రమము చక్కగా గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి
నూనెలో మిర్చి చక్కగా గోరిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి
పచ్చిమిర్చిలో కారం రుచి కొరకు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి
పచ్చిమిర్చి నూనెలో మంచిగా గోరిన తర్వాత ఆనియన్ వేసుకొని చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి
ఆనియన్ గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి
రుచి కొరకు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి
ఒక గ్లాస్ రవ్వకు సమానంగా రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు నేను రెండు గ్లాసుల రవ్వకు నాలుగు గ్లాసుల వాటర్ పోస్తున్నాను
మిశ్రమం మొత్తం నీటితో మసలేంతవరకు వెయిట్ చేయాలి
నీరు చక్కగా మసులుతుందండి ఇప్పుడు స్టవ్ స్లిమ్ లో పెట్టి, కొద్ది కొద్దిగా రవ్వ, వేస్తూ చక్కగా కలపాలి, ముద్దలు ముద్దలుగా రాకుండా చక్కగా కలపండి, రవ్వ మొత్తం పోసి చక్కగా కలిపి స్టవ్ స్లిమ్ లో ఉంచండి
ఒక రెండు నిమిషాలు వరకు వెయిట్ చేయాలి, తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి
మనకు కావాల్సిన ఉప్మా రెడీ అయినది

Loading comments...