రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహాగణపతికి పట్టు వస్త్రాలు మరియు తొలి పూజలు....

1 year ago

ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజలు అందుకున్నాడు, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ్ సాయి సౌందర్యరాజన్ గారు, హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ దానం నాగేందర్ గార్ల తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున గణనాధునికి పట్టు వస్త్రాలు సమర్పించారు,

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని లంబోదరుడికి ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ గజ్జల నాగేష్ గారు, బీ ఆర్ ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు శ్రీ మోతె శోభన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి గారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Thank & Regards

PA to Deputy Mayor
G H M C

Loading comments...