పోర్టల్ ఆఫ్ లైట్ యాక్టివేషన్ ~ Telugu promotional video

1 year ago
13

ఇప్పటి వరకు మన జీవితకాలంలో ఇది అత్యంత శక్తివంతమైన గ్రహ క్రియాశీలత!

200 సంవత్సరాలకు తరువాత ప్లూటో మొదటిసారిగా అక్వేరియస్ లోకి ప్రవేశిస్తోంది మరియు మార్చి 23 నుంచి పోర్టల్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ ఎనర్జి అనుభూతి పొందవచ్చు, ప్లూటో తిరోగమనంలోకి మారినప్పుడు మే 1stన దాని గరిష్ట తీవ్రతకు చేరుకుంటుంది మరియు నెమ్మదిగా దశలవారీగా మారుతుంది. ప్లూటో మళ్లీ కుంభం నుండి జూన్ 11న నిష్క్రమిస్తుంది.

అందువల్ల పోర్టల్ ఆఫ్ లైట్ యాక్టివేషన్ అక్వేరియస్ యుగం యొక్క శక్తులను తదుపరి స్థాయికి తీసుకువస్తుంది.

అలాగే యాక్టివేషన్ సమయంలో, ప్లూటో 0 డిగ్రీల 18 నిమిషాల జెమిని మరియు M87 గెలాక్సీ (కన్యరాశి సమూహంలోని ప్రధాన గెలాక్సీ, ఈ విశ్వంలో గెలాక్సీ ప్రేమకు మూలం) ఆల్సియోన్ (ప్లీయాడ్స్‌లోని మన స్థానిక సెంట్రల్ సూర్యుడు) 1 డిగ్రీల 14 నిమిషాల తుల తో ఖచ్చితమైన గ్రాండ్ ట్రైన్‌ను చేస్తుంది. ఈ గ్రాండ్ ట్రైన్‌ గ్రహానికి విశ్వ ప్రేమ యొక్క అత్యంత పవర్ఫుల్ శక్తులను తెస్తుంది మరియు ఇది గెలాక్సీ కేంద్రం నుండి శక్తులు మన గ్రహానికి స్వేచ్ఛగా ప్రవహించేలా చేసే ట్రిగ్గర్ అవుతుంది. కాస్మిక్ లవ్ ఎనర్జీల ఫ్లాష్ విర్గో సూపర్‌క్లస్టర్‌లోని M87 గెలాక్సీ నుండి ఉద్భవిస్తుంది మరియు AION పోర్టల్ యాక్టివేషన్ సమయంలో M87 నుండి భూమికి చేరుకున్న ఫ్లాష్ కంటే ఇది చాలా శక్తివంతమైనది.

చివరి అక్వేరియస్ యుగం యొక్క యాక్టివేషన్ ధ్యానం లో జరిగిన ఫ్లాష్ కంటే ఇది మరింత శక్తివంతమైనది.

మార్చి 23 నుండి జూన్ 11 వరకు అక్వేరియస్ రాశిలో ప్లూటో ఉన్నంత కాలం ఈ గ్రాండ్ ట్రిన్ సక్రియంగా ఉంటుంది. అక్వేరియస్ లోని ప్లూటో ఫస్ట్ కాంటాక్ట్ వైపు సానుకూల భూలోకేతర జాతుల కేంద్రీకృత ప్రయత్నాన్ని సూచిస్తుంది మరియు ప్లీయాడియన్లు ఇందులో చాలా చురుకైన పాత్రను కలిగి ఉంటారు.

మనం సాధ్యమైనంత ఉత్తమమైన సమయంలో పోర్టల్ ఆఫ్ లైట్ ధ్యానం చేస్తాము, అది మానవాళిపై గరిష్ట సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది లాస్ ఏంజిల్స్‌లో మే 1వ తేదీన ఉదయం 10:06 PDTకి ఉంటుంది. ఇది డెన్వర్‌లో ఉదయం 11:06 MDT, చికాగోలో 12:06 pm CDT, న్యూయార్క్‌లో 1:06 pm EDT, లండన్‌లో 6:06 pm BST, పారిస్‌లో 7:06 pm CEDT, కైరోలో 8:06 pm EET , 10:36 pm IST భారతదేశంలో, మే 2న తైపీ మరియు బీజింగ్‌లలో 1:06 am CST, మే 2న టోక్యోలో 2:06 am JST మరియు మే 2న సిడ్నీలో 3:06 am AEST.

సూచనలు (మన ధ్యానం కోసం సూచించబడిన సమయం 20 నిమిషాలు):

1.రిలాక్స్డ్ చైతన్యపు స్థితిలోకి రావడానికి మీ స్వంత పద్దతిని ఉపయోగించండి.

2. మీ సంకల్పాన్ని ఇలా చెప్పండి. పోర్టల్ ఆఫ్ లైట్‌ను తెరవడంలో సహాయపడే సాధనంగా ఈ ధ్యానం ఉపయోగింపబడాలి.

3. ధ్యానం సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి వైలెట్ ఫ్లేమ్‌ను దాని ప్రాథమిక మూలం నుండి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయనివి అన్నీ రూప పరివర్తనం కావించబడాలి.

4. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడే అద్భుతమైన తెల్లని కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేయండి, ఆపై ఈ విశ్వంలోని అన్ని గెలాక్సీల సెంట్రల్ సన్ లకు ప్రసరింపబడుతోంది, M87 గెలాక్సీ యొక్క సెంట్రల్ సన్ ద్వారా కూడా ప్రవహిస్తుంది. ఈ కాంతి గెలాక్సీ సెంట్రల్ సన్‌ని యాక్టివేట్ చేస్తూ, ఆపై మన గెలాక్సీ ద్వారా వెళ్లి, ఆపై మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించి, మన సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవుల ద్వారా వెళుతున్నట్లు, ఆపై భూమిపై ఉన్న అన్ని జీవుల ద్వారా మరియు మీ శరీరం ద్వారా ప్రవహిస్తూ భూమధ్య భాగం వరకు వెళుతున్నాది.

5. ఈ కాంతి భూమిపై మిగిలి ఉన్న చీకటిని రూప పరివర్తనం చెందిస్తోంది, అన్ని అసమానతలను హీల్ చేస్తోంది, అన్ని యుద్ధాలను అంతం చేస్తోంది, సమస్త పేదరికాన్ని తొలగిస్తోంది మరియు సమస్త మానవాళికి సమృద్ధిని తీసుకువస్తున్నాది. మానవత్వం యొక్క గొప్ప ఆధ్యాత్మిక మేల్కొలుపు జరుగుతూ పాజిటివ్ extraterrestrial జాతులతో కాంటాక్ట్ ప్రక్రియను విజువలైజ్ చేయండి. భూమిపై ఉన్న అన్ని జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు సంతోషాన్ని అందించడం ద్వారా అక్వేరియస్ యుగం ప్రారంభ యొక్క కొత్త గ్రాండ్ కాస్మిక్ సైకిల్‌ను విజువలైజ్ చేయండి.

పోర్టల్ ఆఫ్ లైట్ గురించి నవీకరణలు:

http://2012portal.blogspot.com

http://regret2revamp.com/te/home-telugu/

Music: "I am Iron", "Irish Sunset" Royalty free music from https://www.FesliyanStudios.com

Loading comments...