Pawan Kalyan Starts Shooting for Nandamuri Balakrishna's Talk Show'Unstoppable 2'

2 years ago
31.7K

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో "అన్ స్టాపబుల్ "... ప్రేక్షకుల విశేష ఆదరణతో దూసుకుపోతోంది. వరుసగా రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, దర్శకులు, పరిశ్రమ పెద్దలు అతిథులుగా వస్తున్న ఈ షో... వీక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. ప్రభాస్ ఎపిసోడ్ ఈ వారాంతంలో స్ట్రీమింగ్ కానుండగా... కొత్త ఏడాదిలో వచ్చే మొదటి ఎపిసోడ్ కు అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. షూటింగ్ కోసం బాలయ్య, పవన్ రాకతో... స్టూడియో వద్ద సందరి వాతావరణం నెలకొంది. ఇద్దరు అగ్రనటులను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వారిని చూసి కేరింతలు కొట్టారు

Loading comments...