Bharat Biotech Announces Price of Intranasal Covid Vaccine

1 year ago
31K

కొవిడ్ పై పోరులో భారత్ బయోటెక్ మరో ఘనత సాధించింది. ముక్కు ద్వారా వేసుకునే "ఇన్ కో వ్యాక్ " టీకా మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికి బూస్టర్ డోసుగా దీనిని అందించనున్నట్లు పేర్కొంది. జనవరి చివరివారం నుంచి దీనిని మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ప్రభుత్వానికి 325 రూపాయలకు దీనిని విక్రయిస్తుండగా ప్రైవేట్ మార్క్ ట్ లో 800 అందించనున్నట్లు వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా... 3వేలకు పైగా మందిపై నిర్వహించిన ట్రయల్స్ లో"ఇన్ కో వ్యాక్ " టీకా సత్ఫలితాలు సాధించిందని భారత్ బయోటెక్ ప్రకటించింది..----------------------------------------------------------------------------------------------------------------------------

Loading comments...